హోం గార్డ్ వేధింపుల నుంచి మహిళకు రక్షణ కల్పించాలని డిమాండ్… ఒట్టూరు సంపత్ రాజు

283

PV NEWS/NELLORE;- అప్పు తీర్చాలని మహిళను వేధింపులకు గురి చేస్తున్న హోంగార్డు శ్రీనివాసులురెడ్డి బారి నుంచి రక్షణ కల్పించాలని యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు ఒట్టూరు సంపత్ రాజు డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బాధితురాలితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఉదయగిరి దేకూరుపల్లి గ్రామానికి చెందిన బీసీ మహిళ బంకా ప్రభావతి వరికుంటపాడు లో హోంగార్డుగా పని చేస్తున్న శ్రీనివాసులు రెడ్డి వద్ద అవసరాల కోసం అప్పు తీసుకున్నారని తెలిపారు. తన బాకీ తీర్చాలంటూ ప్రభావతి కుటుంబం పై హోంగార్డు దౌర్జన్యం చేయడంతో ఊరి వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉదయగిరి పోలీసులు సైతం ఆమెను తీవ్రంగా దుర్భాషలాడి బెదిరిస్తున్నారన్నారు. ఆస్తి అమ్మి అప్పు తీరుస్తామని చెబుతున్నప్పటికీ పోలీసులు అభ్యంతరం చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రభావతి కుటుంబానికి రక్షణ కల్పించమని ఏ ఎస్ పి ను కోరుతున్నామన్నారు. సమావేశంలో యాదవ సంఘం నాయకులు నాగేంద్ర రావు, సంక్రాంతి వెంకటేశ్వర్లు, యాదవ సంఘం అధ్యక్షులు గంగుల మధుసూదన్, బాధితురాలు బంక ప్రభావతి తదితరులు పాల్గొన్నారు.