ఈ పేరు పెడితే ఎస్పీ బాలసుబ్రమణ్యం కోరిక తీరినట్లే….

93

PV NEWS/ NELLORE;- నెల్లూరు పెన్నా బ్యారేజీకి మహా కవి తిక్కన పేరును నామకరణం చేయాలని మాజీ కార్పొరేటర్ టిడిపి నేత ఉచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పెన్నా బ్యారేజి నిర్మిస్తున్న ప్రాంతంలో తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించారని గుర్తుచేశారు. పెన్నా బ్యారేజీకి తిక్కన పేరు పెడితే నెల్లూరు వాసి దివంగత గాన గంధర్వ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కల నెరవేరుతుందన్నారు. రాజకీయలకతీతంగా అన్ని పార్టీల సహకారాన్ని కొరతామన్నారు. జిల్లా మంత్రులను ఎంపీలను, శాసనసభ్యులను, బి జె పి, సి పి ఎం, సి పి ఐ, జనసేన,అన్ని పార్టీల నాయకులను కలిసి అభ్యర్ధిస్తామని తెలిపారు. త్వరలో జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం సమర్పిస్తామన్నారు.