ఏ మహిళా పేదరికంతో బాధ పడకూడదనేదే జగనన్న ఆశయం… వేలూరు మహేష్

83

PV NEWS/ NELLORE;- రాష్ట్రంలో ఏ మహిళా పేదరికంతో ఉండకూడదనే ఆశయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకాన్ని ప్రారంభించారని 46వ డివిజన్ వైసీపీ ఇన్చార్జ్ వేలూరు మహేష్ తెలిపారు. డివిజన్ పరిధిలోని పొదుపు గ్రూపు మహిళలకు ఆసరా అర్హత పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ అమ్మ ఒడి, చేయూత, ఆసరా వంటి అనేక సంక్షేమ పథకాలతో అన్ని వయస్సుల, వర్గాల మహిళలను ఆర్థికంగా ఆదుకుంటున్నారన్నారు.