క్రియాశీలక సభ్యత్వంతో పాటు ప్రమాద భీమా కల్పిస్తున్న జనసేన…. కొట్టే వెంకటేశ్వర్లు

83

PV NEWS/ NELLORE;- పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పని చేసిన జన సైనికులకు క్రియాశీలక సభ్యత్వం తోపాటు ప్రమాద భీమాను జనసేన పార్టీ కల్పిస్తుందని జనసేన చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షులు కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్రంలో ని 5 నియోజకవర్గ స్థాయిలో నిర్వహిస్తున్న క్రియాశీలక సభ్యత్వ నమోదుకార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన కార్యాలయంలో రాష్ట్ర నాయకులు మనుక్రాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గానికి సంబంధించి జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొని రూరల్ ప్రాంతంలోని మెగా అభిమానులతో పాటుగా జన సైనికులకు క్రియాశీలక సభ్యత్వాలను అందచేశారు. అనంతరం జనసేన పార్టీ మాస్కుల ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు గునుకుల కిషోర్, అదిశేషయ్య, హరికృష్ణ,ప్రశాంత్, చక్రి, భూపతి తదితరులు పాల్గొన్నారు.