అమరజీవి బాలసుబ్రమణ్యానికి ఘన నివాళి… సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి

60

PV NEWS/ NELLORE;- నెల్లూరు జిల్లా, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ప్రముఖ గాయకులు యస్.పి. బాలసుబ్రహ్మణ్యానికి జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇతర నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. సింహపురి ముద్దుబిడ్డ ఎస్పీ బాలసుబ్రమణ్యం ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భౌతికంగా దూరమైనా ఆయన గీతాలతో ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారన్నారు. నాలుగు దశాబ్దాలపాటు సంగీత సామ్రాజ్యానికి మకుటంలేని మహారాజుగా వెలుగొంది, గంభీరంగా నిష్క్రమించారన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి గా అనేక రకాల బాధ్యతలను తన జీవిత కాలంలో సమర్థవంతంగా నిర్వహించారన్నారు. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, నివాళులర్పిస్తున్నామన్నారు.