ప్రభుత్వం అందిస్తున్న సొమ్మే మీ వ్యాపారానికి పెట్టుబడి.. కమిషనర్ దినేష్

56

PV NEWS/ NELLORE;-సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న సొమ్మును వ్యాపారాలకు పెట్టుబడిగా మలుచుకోవాలని కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో వైఎస్ఆర్ ఆసరా సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక పరిస్థితి మెరుగుపడేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో ఆర్థిక సాయం చేస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి మహిళా సద్వినియోగ పరుచుకోవాలని పిలుపునిచ్చారు. అనంతరం లబ్ధిదారులకు డ్వాక్రా సహకారంతో అందజేసిన చెక్కులను ప్రదర్శించారు. కార్యక్రమంలో వైసిపి మహిళా నాయకులు పాల్గొన్నారు.