జర్నలిస్టులకు కరోనా పరీక్షల నిర్వహణను పరిశీలించిన ఆర్ డి ఓ

44

Peoples Voice/NELLORE;- జర్నలిస్టులకు ప్రభుత్వ సహకారం ఎల్లవేళలా ఉంటుందని నెల్లూరు ఆర్డీఓ హుసేన్ సాహెబ్,సర్కిల్ ఇన్స్పెక్టర్ మధుబాబు తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ వద్ద సంజీవిని బస్సు ద్వారా జర్నలిస్టులకు, వారి కుటుంబ సభ్యులకు కరోన పరీక్షల నిర్వహణను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాయింట్ కలెక్టర్ ప్రభాకర్రెడ్డి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఆరోగ్య సిబ్బందితో పాటు జర్నలిస్టులు కరోనా సమయంలో విధులు నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారని కొనియాడారు. అనంతరం ఎపియుడబ్ల్యుజె రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ మాట్లాడుతూ విధినిర్వహణలో కరోనా కారణంగా మృతి చెందిన జర్నలిస్టులకు సంతాపం తెలియజేస్తూ వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. మరణించిన జర్నలిస్టులకు కేంద్ర ప్రభుత్వం యాభై లక్షలు మంజూరు చేయాలని ఆయన కోరారు. విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులు నిబంధనలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమానికి సంధానకర్తగా ఈసి మెంబర్ నయీం ఖాన్ వ్యవహరించారు.