ఈ నెల 21వ తేదీ నుంచి విద్యాలయాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి

162

PV NEWS/ NELLORE;- కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్యాలయాలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్ లాక్ 4 నిబంధనలను అనుసరించి సెప్టెంబర్ 21వ తేదీ నుంచి విద్యాలయాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.9, 10 తరగతుల, ఇంటర్ విద్యార్థులు తరగతులకు తల్లిదండ్రుల అనుమతి పత్రాలతో హాజరు కావచ్చని తెలిపింది. అదేవిధంగా పీజీ, పీహెచ్ డి విద్యార్థులు సైతం కళాశాలలకు హాజరు కావచ్చని తెలిపింది.