వలంటీరు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి – కమిషనర్ దినేష్ కుమార్

12402

PV NEWS/ NELLORE;- నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ డివిజనుల్లో ఖాళీగా ఉన్న వలంటీరు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కమిషనర్ దినేష్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. పదవ తరగతి విద్యార్హతగా కలిగిన వారు ఈ నెల 23 వ తేదీ లోపు గ్రామ/వార్డు సచివాలయం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని, ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తామని తెలిపారు. వలంటీర్లుగా ఎంపికైన వారికి స్థానిక సచివాలయాల్లో విధులు కల్పిస్తామని కమిషనర్ పేర్కొన్నారు.