రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన బిల్లులను వెంటనే రద్దు చేయాలి… శైలజానాథ్

98

PV NEWS/ NELLORE;- రైతు ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆమోదించిన బిల్లులు, విద్యుత్ మోటార్ లకు అమర్చే మీటర్ల ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని పిసిసి అధ్యక్షులు డాక్టర్ శైలజానాథ్ డిమాండ్ చేశారు. బిజెపి ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ చేపట్టిన రెండు కోట్ల సంతకాల సేకరణ పత్రాలపై సంతకం చేసిన శైలజానాథ్ నెల్లూరు నగరంలోని ఇందిరా భవనంలో ఏఐసిసి పిలుపుమేరకు డిసిసి అధ్యక్షులు చేవూరు దేవ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజనాథ్, దేవ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ద్రోహం చేస్తున్న బీజేపీకి అనుకూలంగా వైసీపీ టీడీపీలు ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నారు. బిజెపి పాలనలో దేశ ఆర్థిక సామాజిక పరిస్థితి నానాటికీ దిగజారిపోతుందని ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా లోక్ సభలో కేంద్ర ప్రభుత్వం బిల్లులు పెడుతుంటే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలు మద్దతు పలుకుతున్నాయని మండిపడ్డారు. రైతు పక్షపాతి ముసుగులో వైసీపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు మద్దతు తెలిపి రైతులను మోసం చేస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక బిల్లును 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యతిరేకిస్తే రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష నాయకులు మద్దతు తెలపడం ద్వారా రైతులకు అన్యాయం చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించేందుకు రెండు కోట్ల సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టిందన్నారు.