ఎన్.ఎస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ విస్తృతస్థాయి సమావేశం

90

PV NEWS/ NELLORE;- నెల్లూరు కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో ఎన్.యస్.యు.ఐ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్ అధ్యక్షతన,జిల్లా అధ్యక్షులు ఎస్కే. కరిముల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శైలజానాథ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ఎన్ఎస్యుఐ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. భవిష్యత్తులో ఎన్.యస్.యు.ఐ.ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమాలు భారీగా నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందని, ఆర్ఎస్ఎస్, బిజెపి,వైసిపి,టిడిపి పార్టీల వికృత,కుట్ర రాజకీయ చేష్టలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఇటు రాష్ట్రంలోనూ,అటు దేశంలోనూ తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి రాహుల్ గాంధీని దేశ ప్రధానమంత్రి చేసే వరకు ఎన్.ఎస్.యు.ఐ. కృషి చేయాలని కార్యవర్గానికి దిశానిర్దేశం చేయడం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు దేవకుమార్ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొవ్వ.మోహన్ రావు, ఎన్.యస్.యు.ఐ. జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ శ్రీ బి.అనులేఖ,కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు ఏటూరి.శ్రీనివాసులు రెడ్డి,సేవాదళ్ జిల్లా అధ్యక్షులు కొండా.అనిల్ కుమార్, నూతనంగా నియమింపబడిన జాతీయ కోఆర్డినేషన్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, వివిధ జిల్లాల అధ్యక్షులు,ఎన్ఎస్యుఐ నాయకులు పాల్గొన్నారు.