పేదలకు హౌస్ ఫర్ ఆల్ గృహాలను ఇచ్చే వరకు మా పోరాటం ఆగదు… టిడిపి నాయకులు

83

PV NEWS/ NELLORE;- తమ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన హౌస్ ఫర్ ఆల్ గృహాలను లబ్ధిదారులకు ఇచ్చే వరకు తమ పోరాటం ఆగదని టిడిపి నెల్లూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్, నగర ఇంఛార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ముంపునకు గురైన ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం పేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుందన్నారు. నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలను లబ్ధిదారులకు ఇవ్వాలని అడిగిన వారిపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు హౌస్ ఫర్ ఆల్ నిర్మాణం పూర్తి చేసుకున్న గృహాలను అందించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.