అపోలో హాస్పిట‌ల్స్‌లో పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగం

56

PV NEWS/NELLORE;- పోస్ట్ క‌రోనాతో బాధ‌ప‌డేవారి కోసం అపోలో హాస్పిట‌ల్స్ స‌రికొత్త విభాగాన్ని ఏర్పాటు చేసిందని హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీ రామ్ సతీష్ తెలిపారు. నెల్లూరు నగరంలోని అపోలో హాస్పటల్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ పోస్ట్ క‌రోనా నియంత్ర‌ణ విభాగాన్ని అక్టోబర్ 19వ తేది నుంచి దేశ‌వ్యాప్తంగా ఉన్న అపోలో గ్రూప్స్ హాస్పిట‌ళ్ల‌లో అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు. క‌రోనా వ్యాధి నుంచి బ‌య‌ట ప‌డిన వారిలో 50 శాతం మంది శ్వాస స‌రిగా తీసుకోలేక‌పోవ‌డం, హృద్రోగ స‌మ‌స్య‌లు, కీళ్ల నొప్పులు, కంటి చూపు స‌మ‌స్య‌లు వంటి ఇత‌ర ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారన్నారు. అపోలో హాస్పిట‌ల్స్ ప్ర‌త్యేక‌మైన వైద్య‌బృందంతో, నిపుణులైన న్యూరాలజీ, ఇమ్యూనాల‌జీ వైద్యుల‌తో ఈ పోస్ట్ క‌రోనా కంట్రోల్ సెంట‌ర్‌ ద్వారా అత్యాధునిక చికిత్స అందిస్తున్నామన్నారు. క‌రోనా వ్యాధి నుంచి కోలుకున్నవారు వివిధ అనారోగ్య‌ స‌మ‌స్య‌లతో సంప్ర‌దిస్తున్నార‌ని‌, క‌రోనా నుంచి బ‌య‌ట ప‌డిన త‌రువాత రోగులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకే ఈ పోస్ట్ క‌రోనా రిక‌వ‌రీ క్లీనిక్‌ను ప్రారంభించిన‌ట్లు తెలిపారు. పోస్ట్ క‌రోనా వ‌చ్చిన వారిలో ప్ర‌ధానంగా గుండె నొప్పి, బిపి, ర‌క్త‌పోటు వంటి స‌మ‌స్య‌ల తీవ్రత అధికంగా ఉంటుంద‌న్నారు. పోస్ట్ క‌రోన వ‌చ్చిన వారిలో అధికశాతం మంది గుండెపోటుతో మృతి చెందార‌ని తెలిపారు. అపోలో హాస్పిట‌ల్ డాక్ట‌ర్లు దినేశ్ రెడ్డి ,డాక్టరు యం.సి.యస్ రెడ్డి ,డాక్టరు ఉమామహేశ్,డాక్టరు అనిత లు మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ ఊపిరితిత్తుల‌పైనే కాకుండా, శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల‌పై దాడి చేస్తున్న కారణంగా దీర్ఘ‌కాలిక ఆరోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌న్నారు. అపోలో హాస్పిట‌ల్ యూనిట్ హెడ్ నవీన్ మాట్లాడుతూ 70శాతం మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మైన పోస్ట్ క‌రోనాను ఎదుర్కునేందుకు ప‌రిష్కార మార్గాలు చూపించ‌లేక‌పోతే పోస్ట్ క‌రోనా విజృంభించి, మ‌ర‌ణాల రేటు మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ విభాగం ద్వారా టెలిక‌న్స‌ల్టెన్సీ, నేరుగా క్లినిక్ సేవ‌లు అందించే కార్య‌క్ర‌మాల‌ను చేప‌ట్టి, ఈ పోస్ట్ కోవిడ్ సిండ్ర‌మ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధ‌మైనట్లు వెల్ల‌డించారు. తొలుత ఈ పోస్ట్ కోవిడ్ రిక‌వ‌రీ విభాగాల‌ను చెన్నై, మ‌ధురై, హైద‌రాబాద్‌, బెంగ‌ళూరు, మైసూరు , కోల్‌క‌త్తా, భువ‌నేశ్వ‌ర్‌, గోహ‌తి, ఢిల్లీ, ఇండోర్‌, ల‌క్నో, ముంబై, అహ్మాదాబాద్‌ల‌లోని కోవిడ్‌కు చికిత్స‌లు అందించే అపోలో హాస్పిట‌ల్స్‌లో ప్రారంభిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌రిన్ని వివ‌రాల కోసం అపోలో హాస్పటల్ను సంద‌ర్శించాల‌ని, లేదా 0861-3337333, 0861-6667333 నెంబ‌ర్‌లకు కాల్ చేయాల‌ని సూచించారు.