కేఎన్ఆర్ హైస్కూల్లో జగనన్న విద్య కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

100

PV NEWS/NELLORE;- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని కె.ఎన్.ఆర్. హై స్కూల్ లో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ చరిత్రలోనే ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని, విద్యార్థుల చదువుకు అవసరమైన కిట్ ను ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆర్ధిక సంక్షోభం, కరోనా కష్టకాలంలోనూ సంక్షేమకార్యక్రమాల అమలులో రాజీ పడడం లేదన్నారు.