శుభ‌మ‌స్తులో శరన్నవరాత్రి ఉత్సవాలు…

145

PV NEWS/ NELLORE;- నెల్లూరులోని ప్రముఖ షాపింగ్ మాల్ శుభమస్తులో శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. షాపింగ్ మాల్ అధినేతలు బయ్యా వాసు, బయ్యా రవికుమార్ శక్తి విగ్రహాన్ని ప్రతిష్టించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ దసరా పర్వదినాన నెల్లూరు జిల్లా వాసులకు అన్ని విజయాలు, శుభాలు కలగాలని ఆకాంక్షించారు. వివాహాది వేడుకలకు ప్రత్యేకమైన పట్టువస్త్రాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచామన్నారు. శుభమస్తుకి కంచి…మన ఊరికి మంచి అనే క్యాప్షన్ తో ఈ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.