ప్రత్యేక కార్పొరేషన్ ల ఏర్పాటుతో బీసీలకు పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రికి ధన్యవాదాలు….

131

PV NEWS/NELLORE;- రాష్ట్రంలోనే కాక దేశ చరిత్రలోనే బీసీ కార్పొరేషన్ లను ఏర్పాటు చేసి అత్యధికంగా మహిళలకు పదవులు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నూతనంగా నియమితులైన కార్పోరేషన్ల చైర్మన్లు తెలిపారు. వైసిపి జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుని ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మహిళలకు అత్యధిక పదవులు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తమ సామాజిక వర్గ ప్రజల అభ్యున్నతి కోసం కార్పొరేషన్ల ద్వారా కృషి చేస్తామన్నారు. సమావేశంలో రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ కొర్న వెంకట నారాయణ ముదిరాజ్, రాష్ట్ర జంగం కార్పొరేషన్ చైర్మన్ వలివేటి ప్రసన్న, రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ కిషోర్ సింగ్, రాష్ట్ర ముస్లిం సంచారజాతుల కార్పొరేషన్ చైర్మన్ సయ్యద్ ఆసిఫా తదితరులు పాల్గొన్నారు.