హౌసింగ్ బోర్డ్ కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి దుర్మరణం…

181

PV NEWS/ NELLORE;- నెల్లూరు హౌసింగ్ బోర్డు కాలనీ లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. తెగిపడిన విద్యుత్ తీగ తగలడంతో వేణుగోపాల్ అనే రిటైర్డ్ టీచర్ మృతి చెందారు. అతనిని కాపాడేందుకు వెళ్లిన భార్య లత, తల్లి బుజ్జమ్మ అనే ఇద్దరు మహిళలు సైతం విద్యుదాఘాతానికి గురై దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి.