క్రికెట్ బెట్టింగ్ గ్యాంగ్ పని కాదు… కారు వివాదమే కారణం.. డిఎస్ పి

152

PV NEWS/ NELLORE;- వ్యక్తిపై దాడి జరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. వివాదానికి క్రికెట్ బెట్టింగ్ కారణమని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. స్పందించిన నెల్లూరు రూరల్ పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. రూరల్ డి.ఎస్.పి హరినాథ్ రెడ్డి, నగర్ డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరాలు తెలిపారు. వీడియో ఆధారంగా బాధితుడి నుంచి ఫిర్యాదు స్వీకరించి విచారణ చేపట్టామన్నారు. నెల్లూరు నగర పరిధిలోని చంద్రబాబు నగర్ కు చెందిన కావేరి పాకం యుగంధర్ అలియాస్ పండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామన్నారు. నెల్లూరు బట్వాడి పాలెంకు చెందిన శ్రీకాంత్ ఇన్నోవా కారును బాధితుడు యాక్సిడెంట్ చేసి నష్టపరిహారం ఇవ్వని కారణంగా వివాదం చోటు చేసుకుందన్నారు. శ్రీకాంత్ స్నేహితులు నెల్లూరు భక్తవత్సల నగర్ కు చెందిన తుమ్మగుంట రాజశేఖర్, సంతపేటకు చెందిన కిరణ్, ఫతేఖాన్ పేట కు చెందిన అబూ షరీఫ్ లు మూడవ మైలు ప్రాంతంలోని ఖాళీస్థలానికి తీసుకుని వెళ్లి దాడి చేశారన్నారు.