హౌసింగ్ కుంభకోణంపై విచారణ జరపాలి… మిడతల రమేష్

77

PV NEWS/ NELLORE ;-వైయస్సార్ నగర్ ఇందిరమ్మ గృహాలు లో జరిగిన 8 కోట్ల రూపాయల అవినీతిపై విచారణ చేపట్టాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సీనియర్ నేత ఎం రమేష్ అధికారులను కోరారు. లబ్ధిదారుల గృహాలను అన్యాక్రాంతం చేస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శేషయ్య ను ప్రశ్నించారు. వై ఎస్ ఆర్ నగర్ లో నిర్మించిన 6120 గృహాలలో లో 1730 గృహాలు నివాసానికి పనికిరావని టెక్నికల్ కమిటీ నిర్ధారించిందన్నారు. 8 కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగితే ఇంతవరకు ఎవరి పై చర్యలు తీసుకోలేదన్నారు. లబ్ధిదారులు గృహప్రవేశాలు చేయకపోవడంతో వాటిని అన్యాక్రాంతం చేస్తు హోసింగ్ కుంభకోణానికి పాల్పడుతున్నారన్నారు. విచారణ జరిపించి అర్హులైన లబ్ధిదారులకు అన్యాయం జరగకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బిజెపినీలగిరి సంగం మండల అధ్యక్షుడుచిలక ప్రవీణ్. బెల్లంకొండ రామకృష్ణ.చిట్టెప రెడ్డి వెంకటరమణ .కేశవ లు పాల్గొన్నారు.