గుంతలు పడ్డ రోడ్లకు వెంటనే మరమ్మత్తులు చేయండి… ఆర్ &బి అధికారులకు రూరల్ ఎమ్మెల్యే ఆదేశం

38

PV NEWS/ NELLORE ;- గుంతలు పడ్డ రోడ్ల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వెంటనే మరమ్మతులు చేయాలని ఆర్ అండ్ బి అధికారులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశించారు. రూరల్ కార్యాలయంలో R&B, పంచాయతీ రాజ్ అధికారులతో చర్చించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలాచోట్ల రోడ్లు దెబ్బతిని అధ్వాన్నంగా తయారైయాయన్నారు. వెంటనే వాటిని మరమ్మతులు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.