నవజాత శిశువులకు రెటినోపతి స్క్రీనింగ్, లేజర్ చికిత్స… సత్య సాయి అక్షయ సేవా ట్రస్ట్

104

PV NEWS/ NELLORE;- నెలలు నిండకుండా జన్మించిన శిశువులకు శ్రీ సత్య సాయి అక్షయ సేవ ట్రస్ట్, చెన్నై రాధా త్రి త్రినేత్రాయ హాస్పిటల్, సక్షం సంయుక్త ఆధ్వర్యంలో రెటినోపతి స్క్రీనింగ్, లేజర్ చికిత్స ఉచితంగా అందిస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు కె. రాజేశ్వరి, డాక్టర్ సురేష్ తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో చెన్నై రాధాత్రి త్రినేత్ర లయ వైద్యులు వసుమతి, ప్రవీణ్ 28 మంది శిశువులకు స్క్రీనింగ్ నిర్వహించి తొమ్మిది మంది శిశువులకు చికిత్స చేశారు. అనంతరం డాక్టర్ వసుమతి మాట్లాడుతూ బరువు తక్కువగా జన్మించిన శిశువులకు రక్తనాళాల హాని కారణంగా భవిష్యత్తులో కంటి చూపు లోపం ఏర్పడే అవకాశం ఉందన్నారు. స్క్రీనింగ్ ద్వారా గుర్తించిన శిశువులకు అత్యాధునిక పరికరాలతో లేజర్ చికిత్స అందిస్తున్నామన్నారు.