రాష్ట్రంలో రివర్స్ పాలన సాగుతోంది…. టిడిపి మహిళా నేత తాళ్ళపాక అనురాధ

146

PV NEWS/NELLORE;–టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలకు పూర్తి వ్యతిరేకంగా రివర్స్ పద్ధతిలో జగన్ పాలన సాగుతోందని రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు టిడిపి సీనియర్ నేత తాళ్ళపాక అనురాధ తెలిపారు. నగరంలోని టిడిపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం శాంతియుతంగా పోరాడుతున్న మహిళలపై ప్రభుత్వ వైఖరి దారుణమన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ మహిళా నిరసనకారులపై దౌర్జన్యం చేయడం సరికాదన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మాటలు విని 151 సీట్లతో రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నియంత పాలన సాగుతోందన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులు 300 రోజులుగా పోరాటం చేస్తుంటే వారిపై అక్రమ కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. మహిళా పోలీసులు లేకుండానే మహిళలను అరెస్టు చేయడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు.