వైన్ షాప్ యాజమాన్యానికి బుద్ధిచెప్పిన హెల్త్ ఆఫీసర్…

31

PV NEWS/NELLORE;- ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా అంటువ్యాధులు ప్రబలకుండా కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యంపై హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ విస్తృత తనిఖీలు చేపట్టారు. దోమలకు ఆవాసాలుగా మారే వర్షపు నీటి నిల్వల పై ప్రత్యేక దృష్టి సారించారు. పొదలకూరు రోడ్డు లోని పలు ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న వ్యర్థ పదార్థాలను నీటి తొట్టెలను తొలగించారు. వాడిన మద్యం బాటిళ్ల లను ఇష్టానుసారంగా ఎక్కడపడితే అక్కడ పడేసిన గ్రీన్ పార్క్ బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యానికి తన పద్ధతిలో బుద్ధి చెప్పారు. సేకరించిన బాటిళ్లను గ్రీన్ పార్క్ బార్ లోనే పడ వేయించారు.