టిడ్కొ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి ఉచితంగా అందజేయాలి.. కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి

107

PV NEWS/ NELLORE ;- తమ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన టిడ్కొ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి పేదలకు ఉచితంగా అందజేయాలని నెల్లూరు టిడిపి నగర ఇన్చార్జ్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ హామీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు. 300 చదరపు అడుగుల ఇళ్లను ఒక రూపాయికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని మిగిలిన వాటికి లోన్ కట్టుకోవలసి వస్తుందని వాలంటీర్లు చెబుతున్నారన్నారు. Tidco గృహాలను అన్నింటిని పూర్తి ఉచితంగా పేదలకు అందజేయాలని డిమాండ్ చేశారు. పేదలకు నీట మునిగే ప్రాంతాలలో కాకుండా సురక్షితమైన నివాస స్థలాలు తొమ్మిది అంకణాలు ఇవ్వాలన్నారు.