స్వచ్ఛందంగా సేవ చేస్తున్నాం.. ఇబ్బంది పెట్టకండి.. రెడ్ క్రాస్ కన్వీనర్ అజయ్ బాబు

245

PV NEWS/ NELLORE ;- ప్రతిఫలం ఆశించకుండా స్వచ్ఛందంగా సేవ చేస్తున్నామని స్వార్థం కోసం దుష్ప్రచారాలు చేసి ఇబ్బంది పెట్టవద్దని రెడ్ క్రాస్ కన్వీనర్ అజయ్ బాబు విజ్ఞప్తి చేశారు. నెల్లూరు మద్రాస్ బస్టాండ్ సమీప కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ అసత్య ప్రచారాలకు బెదిరింపులకు భయపడి రాజీనామా చేస్తే ఇన్నేళ్లు చేసిన సేవ వృధా అవుతుందని భావోద్వేగంతో తెలిపారు. ప్లాస్మా పై అవినీతి ఆరోపణలు వాస్తవాలు కాదని విచారణ కమిటీలు చెప్పినప్పటికీ కొందరు తమ స్వార్థం కోసం దుష్ప్రచారం చేస్తూ మానసిక క్షోభకు గురి చేస్తున్నారన్నారు. ప్లాస్మా విషయాన్ని వక్రీకరించి రెడ్ క్రాస్ ప్రతిష్ఠను దిగజార్చ వద్దని విజ్ఞప్తి చేశారు.