చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా మంచికంటి శ్యామ్.. అభినందించిన నాగబాబు

103

PV NEWS/ NELLORE ; -మెగాస్టార్ చిరంజీవి పై ఉన్న వీరాభిమానమే తనను నెల్లూరు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షునిగా ఎంపిక చేసిందని మంచికంటి శ్యామ్ తెలిపారు. ఈ విషయాన్ని స్వయంగా నాగబాబు ఫోన్ చేసి అభినందించారన్నారు. ఎన్నో ఏళ్లుగా నిస్వార్ధంగా చిరంజీవి అభిమాన సంఘం తరఫున అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. జనసేన ఆవిర్భావం నుంచి పార్టీ అభివృద్ధి కోసం పని చేశామన్నారు. తన సేవాతత్పరతే మెగా ఫ్యామిలీ దృష్టిలో గుర్తింపు తీసుకు వచ్చిందని తెలిపారు. చిరంజీవి యువత నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా తన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా సాయిబాబు ఇతర మిత్రబృందం మంచి కంటి శ్యామ్ ను అభినందించారు.