స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు…

82

PV NEWS/ NELLORE;- నెల్లూరులోని వెంగళరావు నగర్ పార్క్ సమీపంలో మాలమహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఆధ్వర్యం లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. అనంతరం పేదలకు అన్నదానం వస్త్రదానం చేశారు. ఈ సందర్భంగా స్వర్ణ వెంకయ్య మాట్లాడుతూ కరోనా సమయం లో పేదలకు అండగా నిలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రిస్మస్ పర్వదినాన ౩1 లక్షల మంది పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇవ్వడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నెల్లూరు రురల్ ఇంచార్జి కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ యేసునాయుడు, రూరల్ వైసీపీ నాయకులు సునీల్ కుమార్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, 33&34 వైసీపీ ఇంచార్జి మేఘనాధ్ సింగ్, హజరత్ నాయుడు, హరిబాబు యాదవ్, మాజీ బారాషహీద్ చైర్మన్ అబూబకర్, బూర వెంకటేశ్వర్లు గౌడ్, నరసింహులు గౌడ్, మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు బలి వెంకయ్య, మాలమహానాడు ఉపాద్యాక్షులు అరవ ప్రభాకర్ , లాలం పెంచలయ్య చిన్నా రెడ్డి నవీన్ కుమార్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.