కోవిడ్ వాక్సినేషన్ ప్రక్రియపై వైద్య సిబ్బందికి సూచనలు చేసిన ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వెంకట రమణ

68

PV NEWS/ NELLORE ;- కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై కార్పొరేషన్ కార్యాలయంలో వైద్య సిబ్బందికి అవగాహన సదస్సును ఎం హెచ్ ఓ డాక్టర్ వెంకట రమణ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ నగర పరిధిలో 167 వైద్య కేంద్రాలను ఏర్పాటు చేసి, ప్రతీ కేంద్రంలో వ్యాక్సినేటింగ్ వైద్యునితో పాటు ఒక పోలీసు, సచివాలయ డిజిటల్ అసిస్టెంట్, అంగన్వాడీ టీచర్, ఆశా వర్కర్, వార్డు వలంటీరును బృందంగా నియమిస్తామని తెలిపారు. వ్యాక్సినేషన్ మొదటి దశలో వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు అంగన్వాడీ టీచర్లకు వ్యాక్సిన్ అందించనున్నామని తెలిపారు. రెండో దశలో మున్సిపల్ కార్మికులతో పాటు పోలీసు సిబ్బందికి, మూడవ దశలో కరోనా సోకిన వారికి, అనంతరం యాభై ఏళ్ల వయస్సు దాటిన పౌరులకు వ్యాక్సిన్ అందించనున్నామని ఆరోగ్యశాఖాధికారి ప్రకటించారు. అన్ని వైద్య కేంద్రాల్లో ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలను పటిష్టంగా అమలు చేస్తూ నగర ప్రజలందరికీ వ్యాక్సిన్ అందేలా ప్రణాళికలు సిద్ధం చేసి సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నామన్నారు.