అసంపూర్తిగా ఉన్న అభివృద్ధి పనుల పై అధికారులతో చర్చించిన గిరిధర్ రెడ్డి….

83

PV NEWS/ NELLORE;- రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదేశాలతో పబ్లిక్ హెల్త్, కార్పొరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లతో రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రూరల్ నియోజకవర్గం కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ లలో అసంపూర్తిగా ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, మ్యాన్ హోల్స్, ప్యాచ్ వర్కులు కార్పొరేషన్ అధికారులతో సమన్వయం చేసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను కోరారు.