సర్వేపల్లిలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి పైలాన్ ఆవిష్కరణ.. హాజరైన మంత్రులు

87

PV NEWS/ NELLORE;-సర్వేపల్లి నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పథకాల శంకుస్థాపన కు సంబంధించిన పైలాన్ ఆవిష్కరణ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , బాలినేని శ్రీనివాసులు రెడ్డి , నారాయణ స్వామి, మేకపాటి గౌతమ్ రెడ్డి, పొలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ హాజరయ్యారు. అనంతరం పూడిపర్తి గ్రామ సచివాలయ నూతన భవనాన్ని ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రం, వైయస్సార్ హెల్త్ క్లినిక్, రక్షిత మంచినీటి పథకానికి శంకుస్థాపన చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దివంగత ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డికి, దివంగత పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గాప్రసాద్ కి నివాళులర్పించారు.