సైడు కాలువలు.. మంచినీటి సమస్యను పరిష్కరించాలని.. సిపిఎం డిమాండ్

102

PV NEWS/ NELLORE; -నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని 16 వ డివిజన్ లో సైడు కాలువలు, మంచినీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో వెలగ శెట్టి సంఘంలో స్థానికులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం నగర నాయకులు కాయం శ్రీనివాసులు మాట్లాడుతూ గత 15 రోజుల నుంచి వర్షాలతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సైడ్ కాలవలు లేక తాగే నీళ్లళ్లో సైతం మురుగునీరు కలిసి అనారోగ్య పాలవుతున్నారన్నారు. సైడ్ కాలవల నిర్మాణం పూర్తిచేసి సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని కోరారు.