అపార్టుమెంట్లకు నీటి మీటర్ తప్పనిసరి

97

PV NEWS/ NELLORE;- నగరంలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకుల నుంచి మంచినీటి కనెక్షన్లను అన్ని ఇళ్లకు మంజూరు చేస్తున్నామని, నీటి సదుపాయాన్ని కోరే అపార్ట్మెంట్ వాసులు తప్పనిసరిగా మీటర్ ను కలిగిఉండాలని కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. స్థానిక 16 వ డివిజన్ జగదీష్ నగర్ లో మెగా సంస్థ నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకు, కనెక్షన్ల పైపులైన్ నిర్మాణం పనులను అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్థానిక డివిజన్ లలో 750 గృహాలకు మంచినీటి కుళాయిల కనెక్షన్లు మంజూరు చేస్తున్నామని, అవసరమున్నవారు సచివాలయ ఎమినిటీ కార్యదర్శిని సంప్రదించాలని కోరారు. అనంతరం 24 వ డివిజన్ ఎన్జీవో కాలనీ, 22 వ డివిజన్ అనగుంట, 48 వ డివిజన్ ఆనం వెంకట రమణా రెడ్డి నగర్, చిన్న బజారు మండపాల వీధి ప్రాంతాల్లో జరుగుతున్న రోడ్డు నిర్మాణం పనులను పర్యవేక్షించారు. కల్వర్టులు, రోడ్ల నాణ్యతను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.