నిరుపేదల సొంత ఇంటి కల నెరవేరుస్తున్న నేత జగన్మోహన్ రెడ్డి…

57

PV NEWS/ NELLORE;- నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ లో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆదేశాల మేరకు డివిజన్ ఇంచార్జ్ కొండా శివారెడ్డి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ పేదవారి సొంత ఇంటి కలను నిజం చేయాలనే దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు. ఎన్ని అవాంతరాలు కల్పించినా ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఇచ్చిన మాట ప్రకారం పేదవారికి ఒక్క రూపాయికే సొంత ఇంటిని నిర్మించి ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ సొంత ఇంటి కోసం నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైకాపా నేతలు నాగరాజు నాయుడు, కళ్యాణ్, సందీప్, ప్రసాద్ రెడ్డి, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.