ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి అనిల్

74

PV NEWS/NELLORE;- జనవరి 9న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఏర్పాట్లను మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరిశీలించారు. అమ్మ ఒడి ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనున్న నెల్లూరు నగరంలోని ఎన్.టి.ఆర్. నగర్ శ్రీ వేణుగోపాల స్వామి కళాశాల మైదానాన్ని సి.ఎం. ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. కార్యక్రమాన్ని ప్రతిఒక్కరూ విజయవంతం చేయవలసినదిగా కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు కర్తం ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.