మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం-జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు

77

PV NEWS/ NELLORE;- 31 జనవరి నుంచి మూడు రోజులపాటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలియో టీకా 0 _5 ఏళ్ల చిన్నారులకు తప్పక వేయించాలని జిల్లా కలెక్టర్ చక్రధర బాబు తెలియజేశారు. బస్టాండ్లు రైల్వే స్టేషన్ లోనూ పాఠశాలలోనూ 0 నుండి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో టీకా ను తల్లిదండ్రులు వేయించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు విజ్ఞప్తి చేశారు. పోలియో రహిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే లక్ష్యం పిల్లలు బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామని పిలుపునిచ్చారు.