ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు… సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలి.. రూరల్ ఎమ్మెల్యే

145

PV NEWS/ NELLORE;- ఆత్మహత్య చేసుకుంటే సమస్య పరిష్కారం కాదని ఎంతటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో కాంట్రాక్టు ఉద్యోగి ఎంఎన్ఒ ప్రేమ్ కుమార్ 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని ఆత్మహత్యకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించి ధైర్యం చెప్పారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించిన ఉద్యోగులకు తాను అండగా ఉండి న్యాయం చేస్తానన్నారు.