మహిళా సాధికారత పై అవగాహన కల్పించిన 15 వ డివిజన్ కార్యదర్శులు…

59

PV NEWS/ NELLORE;- మహిళా మార్చ్ 100 రోజుల కార్యక్రమంలో భాగంగా నెల్లూరు నగర పరిధిలోని 15 వ వార్డ్ మహిళా సంరక్షణ కార్యదర్సులు వార్డ్ లోని మహిళలు, పిల్లలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానికంగా పర్యటించి మహిళలకు, చిన్నారులకు బాల కార్మికుల నిర్మూలన , మహిళా సాధికారత పైన అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మహిళ సంరక్షణ కార్యదర్శులు మమత , శాంతి , శిరీష తదితరులు పాల్గొన్నారు.