చేతకాకపోతే బాధ్యతల నుంచి తప్పుకోండి.. విఆర్ ప్రిన్సిపల్ పై ఏబివిపి మండిపాటు

78

PV NEWS/ NELLORE;- ఎంతో మంది విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు తోడ్పడిన నెల్లూరు వి ఆర్ కళాశాల అభివృద్ధి పట్ల ప్రిన్సిపల్ నిర్లక్ష్యపు ధోరణి పై ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ అంటూ వి ఆర్ కళాశాల ముందు ఆందోళన చేపట్టారు. సరైన మౌలిక వసతులు ఏర్పాటు చేయడం పట్ల, అధ్యాపకులను నియమించడం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నవారిపై మండిపడ్డారు. వేల రూపాయల జీతాలు తీసుకుంటూ కళాశాలకు ఆలస్యంగా వస్తున్న అధ్యాపకులను నిలదీశారు. కళాశాల అభివృద్ధి పట్ల హామీలకే పరిమితమయిన నేతలపై విమర్శలు గుప్పించారు.