నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ లతో సమావేశమైన ఎమ్మెల్యే కాకాణి

38

PV NEWS/ NELLORE;- నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన 102 మంది గ్రామపంచాయతీ సర్పంచ్ లు,ఉప సర్పంచ్ ల తో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగరం పొదలకూరు రోడ్డు లోని నివాసంలో సమావేశమయ్యారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన వారందరినీ అభినందించారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల ఆదరాభిమానాలు ఉన్నాయనడానికి ఈ గెలుపే సాక్ష్యమన్నారు. తమ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన నాయకులకు కార్యకర్తలకు, ఆదరించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.