నెల్లూరు రూరల్ లో దారుణ హత్య

157

PV NEWS/ NELLORE;- నెల్లూరు రూరల్ ప్రాంతం బుజబుజ నెల్లూరు లో మంగళవారం రాత్రి జరిగిన 26 ఏళ్ల మురుగన్ భాస్కర్ హత్య స్థానికంగా సంచలనం కలిగించింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్షల కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు ఐదుగురుని పట్టుకునేందుకు డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ లక్ష్మణరావు గాలింపులు చేపట్టారు.