కిసాన్ గ్రీవెన్స్ పరిష్కరించడంలో దేశంలోని తొలి స్థానం సాధించిన నెల్లూరు… అవార్డు అందుకున్న కలెక్టర్

85

PV NEWS/ NELLORE;- కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతిష్ఠాత్మక పీఎం-కిసాన్ జాతీయ అవార్డును కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ చేతులమీదుగా జిల్లా కలెక్టర్ చక్రధర బాబు అందుకున్నారు. న్యూఢిల్లీ ఏపీ షిండే హాల్లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రెండవ వార్షికోత్సవ కార్యక్రమంలో అవార్డును కలెక్టర్ అందుకున్నారు. పీఎం కిసాన్ పోర్టల్ కి వచ్చిన గ్రీవెన్స్ పరిష్కరించడంలో దేశంలోనే తొలి స్థానంలో నెల్లూరు నిలిచినందుకు ఈ అవార్డును అందజేశారు.