8 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు

82

PV NEWS/ NELLORE;- నెల్లూరు జొన్నవాడ చెప్పుల షాపులో పని చేస్తూ జీవనం సాగిస్తున్న మణి శరవణ దంపతుల 8 నెలల చిన్నారి కిడ్నాప్ కేసును బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు చేధించారు. కడప జిల్లాకు చెందిన దేరంగుల నాగజ్యోతికి సంతానం లేని కారణంగా నిందితులు ఏగూరు మాలకొండయ్య తోపాటు మరొక ఇద్దరికీ కు చిన్నారిని తమకు అప్పగించినందుకుగాను 50000 ఇచ్చినట్టు విచారణలో తేలింది. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నెల్లూరు రూరల్ ఎస్ డి పి ఓ హరినాథ్ రెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది చిన్నారిని సురక్షితంగా కాపాడి తల్లిదండ్రులకు అప్పగించారు.