గ్రామ పంచాయతీలకు ప్రతిపక్ష నేతలు రాకూడదా?? ప్రశ్నించిన అజీజ్

90

PV NEWS/ NELLORE;- నెల్లూరు రూరల్ పరిధిలోని గ్రామ పంచాయతీలకు ప్రతిపక్ష నేతలు రాకూడదా అని టిడిపి నెల్లూరు పార్లమెంటరీ అధ్యక్షులు మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ ప్రశ్నించారు. ఆమంచర్ల గ్రామ సచివాలయం లో జరిగిన నామినేషన్లకు భారీ కాన్వాయ్ తో అబ్దుల్ అజీజ్ హాజరయ్యారు. దొంతాలి గ్రామ పంచాయతీ నామినేషన్ కు రాకుండా పోలీసులు తమను అడ్డుకోవడం సరికాదన్నారు. నెల్లూరు రూరల్ లో ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా జరిగేటట్లు స్థానిక ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ నాయకత్వం, కలెక్టర్ చర్యలు తీసుకోవాలసిన అవసరం ఉందన్నారు. దొంతాలిలో 350 ఇళ్లుకు 850 ఓట్లు ఉన్నాయని,ఇక్కడికి ప్రతిపక్ష నేతలు రాకూడదా అని ప్రశ్నించారు. టిడిపికి ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకే తమను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారన్నారు. నెల్లూరు నగర ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ అబ్దుల్ అజీజ్ నాయకత్వంలో 18 గ్రామాల్లో నామినేషన్ లు వేశామని, టీడీపీ ని కచ్చితంగా గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రమణయ్య, నగర టీడీపీ అధ్యక్షులు ధర్మవరపు సుబ్బారావు, నెల్లూరు రూరల్ మండల అధ్యక్షులు పముజుల ప్రదీప్, మాజీ కార్పొరేటర్ లు, అన్నీ అనుబంధ సంఘాల నాయకులు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.