అర్ధాంతరంగా వీధిన పడేశారని ఆందోళన చేసిన కరోన వారియర్స్…

198

PV NEWS/ NELLORE;- అర్ధాంతరంగా తమను విధుల నుంచి తొలగించారని నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, రేడియో గ్రాఫర్స్ నెల్లూరు జిజిహెచ్ ఎదుట ఆందోళన చేపట్టారు. కరోనా కష్టకాలంలో కాంట్రాక్ట్ పద్ధతిలో విధుల్లోకి తీసుకుని అర్ధాంతరంగా తొలగించడంతో తమ కుటుంబాలు వీధిన పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోన వారియర్స్ ను విధుల్లోకి తీసుకోవాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు.