ఆర్ టిసి మోసం చేసిందని కార్పొరేషన్ ను ఆశ్రయించిన బాధితురాలు…. న్యాయం జరిగిందా?

144

PV NEWS/ NELLORE;- నెల్లూరు నగరంలోని ఆర్టీసీ అధీనంలో ఉన్న దుకాణానికి రెండు దారులు ఉన్నాయని వ్యాపారం బాగా సాగుతుందని ఆశ చూపి లక్షల రూపాయలను డిపాజిట్ గా తీసుకొని ఆర్టీసీ అధికారులు తమను మోసం చేశారని బాధితురాలు లక్ష్మి కార్పొరేషన్ కమిషనర్ ను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని పలుమార్లు అర్జీలు పెట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే ఆర్టీసీ బస్టాండ్ మెయిన్ గేట్ సమీపంలో దుకాణానికి రెండు ప్రధాన మార్గాలు ఉన్నాయని 2019లో ఆర్టీసీ వ్యాపారం చేసుకునేందుకు టెండర్లు పిలిచింది. ఉపాధి పొందవచ్చనే ఆలోచనతో కె. లక్ష్మి అనే మహిళ టెండర్ ను పాడుకుని ఏడు నెలల అడ్వాన్స్ ను అర్ టిసి కి చెల్లించింది. చిరు వ్యాపారం ప్రారంభించిన పది రోజులకే రెండు మార్గాల్లో ఒక మార్గానికి అడ్డుగా మరొక దుకాణాన్ని ఆర్టీసీ నిర్మించింది. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించిన బాధితురాలికి ఆర్టీసీ అధికారుల నుంచి స్పందన రాలేదు. చెల్లిస్తున్న అద్దెకు తగిన వ్యాపారం జరగక, ఇటు కరోనా కారణంగా పూర్తిస్థాయిలో ఆర్థికంగా నష్టపోయిన బాధితులు న్యాయం కోసం పలువురు మార్లు కలెక్టర్ కు, నగర కమిషనర్ కు అర్జీలు పెట్టుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో ఎట్టకేలకు నగరపాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ స్పందించారు. సంబంధించిన ప్రాంతాన్ని సర్వే చేయించి ఆర్టీసీ నూతనంగా నిర్మించిన దుకాణం మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కారణంగా కూల్చి వేయడంతో బాధితురాలికి న్యాయం జరిగిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.