రీ కౌంటింగ్ పేరుతో వైసీపీ మోసాలకు పాల్పడింది.. పసుపులేటి సుధాకర్

58

PV NEWS/ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపులేటి సుధాకర్ తెలిపారు. బోగోలులోని నివాసంలో మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నడు లేని విధంగా తొలిసారి 60 పంచాయతీల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు పోటీ చేశారన్నారు. ఆరు గ్రామాల్లో నైతికంగా బీజేపీ మద్దతుదారులు గెలిచారని, ఆముదాల దిన్నే, కొత్తపాలెం లాంటి గ్రామాల్లో రిపోలింగ్ పేరుతో ఓట్లు గల్లంతు చేశారని మండిపడ్డారు. అధికార పార్టీ బెదిరింపులతో అభ్యర్థులను, ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారని ఆరోపించారు. బూత్ లెవెల్లో కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగిందని, అనేక చోట్ల వార్డు సభ్యులను గెలిపించుకున్నామని ధీమా వ్యక్తం చేశారు. అధికార పార్టీ బెదిరింపులపై కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తామన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.