అన్ని మండలాలలో ముఖ్యమంత్రికి పాలాభిషేకం… గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

96

PV NEWS/ NELLORE;- జీవో నెంబర్ 2 ద్వారా వీఆర్వోలను గ్రామ సచివాలయ వ్యవస్థ కు డిడిఓ లు నియమించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నెల్లూరు జిల్లా గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి డి వి రమణయ్య ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు నగరంలోని అంబేద్కర్ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి తమపై ఉంచిన బాధ్యతను నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం తరఫున సంక్షేమ పథకాలను బాధ్యతాయుతంగా అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా అన్ని డివిజన్, మండల కార్యాలయాలలో ముఖ్యమంత్రి కి పాలాభిషేకం చేయనున్నట్లు తెలిపారు.సమావేశంలో వీఆర్వోల సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ తిరుపతి, హరిబాబు, మోహన్, హ్యూమన్ రైట్స్ మిషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.