అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఎస్పీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ

83

PV NEWS/ NELLORE;- మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా నెల్లూరు జిల్లా పోలీసులు, మహిళా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు, మహిళలతో పెద్దఎత్తున క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ నుంచి ఆర్టీసీ సర్కిల్ వరకు సాగిన క్యాండిల్ ర్యాలీ ని ఎస్పీ భాస్కర్ భూషణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటుచేసిన దిశ sos app డౌన్లోడ్ చేసుకునేందుకు జిల్లా వ్యాప్తంగా క్యూ ఆర్ కోడ్ తో స్టాండ్లు ఏర్పాటు చేశామన్నారు.