ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి…కమిషనర్ దినేష్ కుమార్

52

PV NEWS/ NELLORE;- తిరుపతి లోక్సభ ఉప ఎన్నికలను ఎన్నికల అధికారి కలెక్టర్ చక్రధర్ బాబు ఆధ్వర్యంలో పటిష్టంగా నిర్వహిస్తున్నామని, అర్హులైన వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కార్పొరేషన్ కమిషనర్ దినేష్ కుమార్ సూచించారు. సర్వేపల్లి నియోజకవర్గం సెక్టర్, నోడల్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులకు వెంకటాచలం మండలంలోని క్యూబా ఇంజనీరింగ్ కళాశాలలో శిక్షణ అందించి, పోస్టల్ బ్యాలెట్ ద్వారా వారి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని తెలిపారు.