గిన్నిస్ రికార్డు కోసం నెల్లూరు చిత్రకారుడు షేక్ అమీర్ జాన్ సేవ్ ట్రీస్ చిత్రం…

87

PV NEWS/ NELLORE;- గిన్నిస్ రికార్డు కోసం నెల్లూరుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు షేక్ అమీర్ జాన్ మేకప్ వస్తువులతో 790 చదరపు అడుగుల సేవ్ ట్రీస్ చిత్రాన్ని చిత్రీకరించారు. అనుకున్న సమయం కంటే ముందుగానే 54 గంటల్లో చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా నెల్లూరులో పలువురు ఆయన్ను అభినందించారు. 25 కళాసంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి, టీవి హాస్య నటులు దోర్నాల హరిబాబు, శుభమస్తు షాపింగ్ మాల్ అధినేత బయ్యా వాసు తదితరులు అమీర్ జాన్ ను అభినందించారు. చిత్రీకరణకు సంబంధించిన వివరాలను గిన్నిస్ రికార్డు సంస్థకు పంపనున్నారు.